విధులకు గైరు హాజరు అయిన ఉపాధ్యాయురాలు మీద క్రమశిక్షణ చర్యలు

 

శ్రీకాకులం న్యూకాలనీ/సంతబొమ్మాళి: జిల్లాలో సంతబొమ్మాళి మండల పరిధిలోని గోవిందపురం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయు రాలు వి. వాసవిపై క్రమశిక్షణా చర్యలు తీసుకు న్నారు. పాఠశాల విధులకు డుమ్మా కొట్టడంపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని డీఈవో గార పగడా లమ్మ బుధవారం ఆదేశించారు. వివరణ ఇవ్వకుంటే సస్పెండ్ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 గతం లో ఉపాధ్యాయురాలిపై గోవిందపురం గ్రామానికి చెందిన సర్పంచ్ ఆర్.రామిరెడ్డితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవో, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. అప్పట్లో పాఠశాలకు డీఈవో వెళ్లిన సందర్భంలో సైతం ఉపాధ్యాయురాలు సమ యపాలన పాటించలేదు. మరలా బుధవారం ఆమె సమయపాలన పాటించకపోవడంతో పాటు విద్యార్దులకు గ్రామంలోని పదో తరగతి విద్యార్థిని పాఠాలు చెప్తుండడంతో చర్యలు తీసుకున్నారు. ఇప్పటికై నా ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకో కుంటే తమ పిల్లలను పాఠశాలకు పంపించేది లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

Flash...   INCOME TAX : ఇన్‌కంట్యాక్స్‌ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు