White Hair: ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!

 White Hair: ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!


White Hair: వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు నెరసిపోవడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోంది. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. అయితే అందులో కొన్నింటిని నిరోధించవచ్చు. జుట్టు పిగ్మెంటేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు వాటి రంగు నలుపు నుంచి తెల్లగా మారుతుంది. చిన్న వయస్సులో జుట్టు నెరిసిపోవడానికి 5 కారణాలు ఉంటాయి. అందులో మొదటిది జీన్స్‌. చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోవడానికి జీన్స్‌ కూడా కారణమవుతుంది. తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత నివారణ లేదు. మీ తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరికైనా బాల్యంలో ఈ సమస్య ఉంటే జీన్స్‌ ప్రకారం అది మీకు సంభవిస్తుంది. అలాగే ఆధునిక కాలంలో చాలామంది విపరీతమైన టెన్షన్‌కి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు నిద్రలేమి, ఆందోళన, ఆకలిలో మార్పులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి వల్ల జుట్టు మూలాల్లో ఉండే కణాలు బలహీనపడుతాయి. దీని కారణంగా జుట్టు తెల్లబడటం మొదలవుతుంది.

ALSO READ: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రి భోజనం ఇలా చేయండి


చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడానికి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కారణమవుతాయి. అందులో ముఖ్యంగా అలోపేసియా లేదా బొల్లి వ్యాధి వల్ల జుట్టు తెల్లబడుతోంది. చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి విటమిన్ లోపం కూడా కారణం కావొచ్చు. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నప్పుడు జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ విటమిన్ శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరుగుదల, రంగును కూడా నియంత్రిస్తుంది. ధూమపానం వల్ల కూడా జుట్టు తెల్లరంగులోకి మారుతుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే ధూమపానం సిరలను సంకోచిస్తుంది. వాటిలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా జుట్టు మూలాలకు తగినంత పోషణ లభించదు. అవి తెల్లగా మారడం ప్రారంభిస్తాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Flash...   MERGING: కిలోమీటర్‌ పరిధిలోనే స్కూళ్ల విలీనం: బొత్స