Release of rank list: ర్యాంకుల జాబితా విడుదల కౌన్సిలింగ్‌ తేదీలు ఇవే.

Release of rank list: ర్యాంకుల జాబితా విడుదల కౌన్సిలింగ్‌ తేదీలు ఇవే.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ, ఆయుర్వేద, యునాని తదితర కోర్సుల సీట్లను భర్తీ చేసేందుకు ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ అభ్యర్థుల ర్యాంక్ జాబితాను మంగళవారం విడుదల చేశారు. దీంతో ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. వివరాలు..

రాష్ట్రంలో 2 ప్రభుత్వ, 11 అటానమస్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 786 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద విభాగంలో 361 సీట్లు, యునాని కాలేజీలో 46 సీట్లు, ప్రభుత్వ హోమియోపతిలో 822 సీట్లు, 11 ప్రైవేట్ కాలేజీలు కలిపి మొత్తం 2,015 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 49 సీట్లు కేంద్ర కోటాలో వస్తాయి. మిగిలిన సీట్లకు 2,695 మంది దరఖాస్తు చేసుకోగా 2,530 దరఖాస్తులను పరిశీలించారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం కోటా సీట్లకు 596 దరఖాస్తులు రాగా 556 దరఖాస్తులను పరిశీలించారు. యాజమాన్య కోటా కింద 1,040 సీట్లకు 968 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సీట్లను నీట్ మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. సాధారణ విద్యార్థులకు 137 మార్కులు, ఇతర విద్యార్థులకు 107 మార్కులను అర్హతగా నిర్ణయించారు.

ఉదయం గిండిలోని కలైంగర్ కరుణానిధి సెంటినరీ మెమోరియల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ కోర్సుల కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన ర్యాంకర్ల జాబితాను, అర్హత సాధించిన వారి వివరాలను ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ విడుదల చేయగా, ఆరోగ్య శాఖ కార్యదర్శి గగన్ దీప్‌సింగ్ బేడీ అందుకున్నారు. ప్రభుత్వ కోటా సీట్లలో సేలంకు చెందిన వైశాలి మొదటి ర్యాంకు, ప్రైవేట్ కోటా సీట్లలో చైన్నెకు చెందిన విద్యార్థి హకరిహరన్ మొదటి ర్యాంక్ సాధించారు.

విద్యార్థులకు 7.5 శాతం పరిధిలో 92 సీట్లు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ధర్మపురికి చెందిన తిరుమల ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 26 నుంచి 29 వరకు కౌన్సెలింగ్ జరగనుంది. సెంట్రల్ కోటా సీట్లను 31న భర్తీ చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Flash...   ప్రతి ఒక్కరికీ 9 రిమోట్ ఉద్యోగాలు... అవేంటో తెలుసా ..

రాష్ట్రంలోని మదురైలో ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తిరుచిరాపల్లిలో సిద్ధ వైద్య ఎయిమ్స్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, స్థలాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో సిద్ధవైద్య యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం చైన్నే శివారులోని మాధవరంలో 25 ఎకరాలను ఎంపిక చేశామన్నారు.