భారతీయులు ఎక్కువగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఏలకులు ఒకటి. వంటకు రుచి, సువాసనతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఏలకులతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు.
ఏలకులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏలకులను సహజ వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఏలకులతో చేసిన టీని ఉదయాన్నే తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
లేకపోతే, ఏలకులు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఏలకుల టీ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి. ఉదర సమస్యలు తగ్గడమే కాకుండా విరేచనాలు కూడా తగ్గుతాయి.. రోజూ టీ తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది.. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.. ఈ టీ తాగితే నోటిలోని బ్యాక్టీరియా నశించిపోతుంది.. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.