RBI Governor: లోన్లు తీసుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్..

RBI Governor: లోన్లు తీసుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్..

ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠినమైన ద్రవ్య విధాన నిర్ణయాలు వడ్డీ రేట్ల గరిష్ట స్థాయికి దారితీశాయి. అయితే, ఇవి ఎంతకాలం కొనసాగుతాయనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. 2023లో ఇప్పటి వరకు ఆర్బీఐ పాలసీ రేట్లను పాజ్ చేస్తూనే ఉందని.. ప్రస్తుతం వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నాయని, ఎంతకాలం కొనసాగిస్తారో చెప్పలేమని అన్నారు. ఈరోజు జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా, అన్ని కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి వడ్డీ రేట్లను పెంచాయి. ఈ క్రమంలో గత ఏడాది మే నుంచి ఆర్‌బీఐ కూడా రెపో రేటును దాదాపు 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆర్బీఐ తెలిపింది. అయితే రెపో రేటు ఇప్పటికే 6.50 శాతానికి చేరుకుంది. ఈ రేట్లు ఎంతకాలం నిలకడగా ఉంటాయో చెప్పలేమని, కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ప్రపంచ వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని శక్తికాంత్ దాస్ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆర్‌బీఐతోపాటు సెంట్రల్ బ్యాంకులు బాధ్యత వహించాలని శక్తికాంత్ దాస్ సూచించారు.

ముడి చమురు ధరలు పెరగడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి ఇటీవలి సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవని ఆయన అన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావచ్చని ఆయన అంచనా వేశారు. రూ.10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వాపస్ రావాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు

Flash...   Re-organisation of Districts - certain information called for