SBI Jobs 2022: Upcoming SBI CLERKS , PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే

 SBI Jobs 2022:  ఎస్‌బీఐ క్లర్క్‌, PO పోస్టులకు నోటిఫికేషన్‌.. అర్హత, దరఖాస్తు వివరాలివే.

దేశవ్యాప్తంగా నిరుద్యోగులు బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ల (Job Notification) కోసం ఎదురుచూస్తుంటారు. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐబీపీఎస్‌ (IBPS) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తాయి. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Of India) మాత్రం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. క్లర్క్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్‌ చేసుకొంటుంది. ఈ ఏడాదికి సంబంధించిన క్లర్క్‌, ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య ఎస్‌బీఐ క్లర్క్‌ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ (Notification) విడుదల అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ ప్రకటించే అవకాశం ఉంది. జూన్‌ లేదా జులైలో 2022 ఎస్‌బీఐ క్లర్క్‌ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలను ఎస్‌బీఐ నిర్వహించే సూచనలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌(Recruitment)లకు సంబంధించి ఎస్‌బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ లేదా మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in ద్వారా అభ్యర్థులు ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు పోస్టులకు సంబంధించి ఒకే నోటిఫికేషన్‌ను విడుదల చేసేది. దాదాపు ఎస్‌బీఐ

2022 SBI  CLERK / PROBATIONARY పోస్టులకు QUALIFICATIONS ఇవే..

Educational

SBI PO (ప్రొబేషనరీ ఆఫీసర్‌) పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కచ్చితంగా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, ఉద్యోగంలో చేరే ముందు అభ్యర్థులు ఫైనల్‌ ఇయర్‌లో ఉత్తీర్ణులు అయినట్లు చూపించాల్సి ఉంటుంది.

Age: 

ప్రొబేషనరీ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల కనీస వయసు 21 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితిని 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వ్డ్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ఠ వయోపరిమితిలో వెసులుబాట్లు ఉంటాయి. అదే విధంగా ఎస్‌బీఐ క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల కనిష్ఠ వయసు 20 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

Flash...   Special FDs: స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఎక్కువ రాబడి.. ఈ నెలాఖరు వరకే అవకాశం

Salary: 

SBI Clerks  బేసిక్‌ పే రూ.19,900 నుంచి ప్రారంభమవుతుంది. probationary officers  శాలరీ రూ.41,960తో మొదలవుతుంది. ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పే చెక్‌లు రూ.36,000-14,90/7-46,430-1,740/2-49,910-1,990/7-63,840గా ఉంటుంది.

Selection Process: 

SBI  ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. మొదటి విడతలో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది. రెండో విడతలో మెయిన్స్‌, ల్యాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు.