Elections 2024: ఓటరు జాబితాలో మీ పేరుందా.? ఇలా ఒక్క నిమిషం లో చూసుకోండి !

Elections 2024: ఓటరు జాబితాలో మీ పేరుందా.? ఇలా ఒక్క నిమిషం లో చూసుకోండి !

ఈ సారి రాష్ట్రము లో ఎలక్షన్ లు ఊహకందని ఉత్కంఠత తో జరిగేలా ఉన్నాయి. మన రాష్ట్రము లో రాజకీయం రోజు రోజుకి ఆసక్తి గా మారుతుంది. ఎన్నికలు రాబోతున్న తరుణం లో ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకుంటారు. ఓటరు జాబితా లో తమ పేరు ఉందొ లేదో తెలుసుకోవటం అవసరం. సాధారణంగా తుది ఓటరు జాబితా ప్రకటించిన తర్వాత ఓటర్ల పేర్లను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే.. తీరిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఓటు ఉందొ లేదో కూడా చూడడం లేదు. కొన్ని చోట్ల జాబితా అందుబాటులో లేదు. పోలింగ్ రోజున ఓటేసేందుకు వెళ్లి ఓటు లేదని గొడవ చేయడం, అధికారులతో వాగ్వాదం చేయడం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఒక వేళ మీ ఓటు లేని పక్షంలో నవంబరు 31 వరకు నమోదుకు అవకాశం ఉన్నందున ఓటర్లు వెంటనే జాబితాలోని పేర్లను సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

ఎక్కడికీ వెళ్లకుండానే మొబైల్ లోనే మీ ఓటు ఉందొ లేదో ఓటరు జాబితాను తనిఖీ చేయవచ్చు. మీరు phone లో electoralsearch.eci.gov.in వెబ్ పేజీని తెరిచి, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకుని మీ పేరు లేదా మొబైల్ నంబర్ లేదా ఓటరు ఎపిక్ నంబర్‌ను నమోదు చేస్తే మీ పేరు ఉందో లేదో తెలుస్తుంది. 5 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మీ ఓటు ని తనిఖీ చేయడం మంచిది

Flash...   AP SSC /10th Results 2022 – bse.ap.gov.in