నెలకు 1 లక్ష పైగా జీతం తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1720 ఉద్యోగ అవకాశాలు

నెలకు 1 లక్ష పైగా జీతం తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1720 ఉద్యోగ అవకాశాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీస్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1720 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. గౌహతి, బరౌని, గుజరాత్, హల్దియా, మథుర, పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్, దిగ్‌బోయ్, బొంగైగావ్ మరియు పరదీప్‌లోని ఐఓసీ శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

ట్రేడ్ అప్రెంటీస్ విభాగంలో మొత్తం 869 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ అప్రెంటీస్ కేటగిరీలో 851 ఖాళీలు ఉండగా, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత ట్రేడ్/డిసిప్లైన్‌లో 10, 12, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి 31 అక్టోబర్ 2023 నాటికి 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు వ్రాత పరీక్ష, వైద్య పరీక్ష మరియు ధృవీకరణ ధృవీకరణ ద్వారా ఎంపిక చేయబడుతుంది.

వచ్చే నెల 20లోపు (November 20) దరఖాస్తు చేసుకోవాలి.

Flash...   Municipal merging teachers should attend to transfer Counselling