C-DAC: సీడాక్‌ లో 159 ఖాళీలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

బెంగళూరులోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సిడాక్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 11 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.590 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వివరాలు…

 ఖాళీల సంఖ్య: 159

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: వల్నరబిలిటీ అసెస్‌మెంట్ పెనెట్రేషన్ టెస్టింగ్(VAPT).

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: వల్నరబిలిటీ అసెస్‌మెంట్ పెనెట్రేషన్ టెస్టింగ్(VAPT).

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అడ్మిన్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్ట్‌లు

విభాగం: MAS-B1.

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

సీనియర్ అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: MAS-B2.

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

Flash...   మే 1 నుంచి 31 వరకు పదవ తరగతి వారికి వేసవి సెలవులు

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అసిస్టెంట్: 01 పోస్ట్

విభాగం: MAS-B3.

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రాజెక్ట్ ఇంజనీర్: 90 పోస్టులు

అర్హత: BE/BTech/MCA లేదా తత్సమాన అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్: 25 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రాజెక్ట్ మేనేజర్: 02 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు

అర్హత: MBA/PG డిగ్రీ (బిజినెస్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మార్కెటింగ్/IT) లేదా తత్సమాన అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 08 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

పార్ట్ టైమ్ ట్రైనర్లు, విజిటింగ్ ఫ్యాకల్టీ: 22 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన అర్హత.

వయోపరిమితి: 17.11.2023 నాటికి 50 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2023.