APPSC Group-2: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2లో 900 పోస్టుల భర్తీ.. ప్రిలిమ్స్ ఎప్పుడో తెలుసా !

APPSC Group-2:  ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-2లో 900 పోస్టుల భర్తీ..  ప్రిలిమ్స్  ఎప్పుడో తెలుసా !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో దాదాపు 900 గ్రూప్-II పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 900 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ఏడాది ఆగస్టు 28న 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇది కాకుండా, గత నోటిఫికేషన్‌లో భర్తీ చేయని పోస్టులను భర్తీ చేసి, ఈ నోటిఫికేషన్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ పోస్టులను భర్తీ చేయాలని APPSC భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్-2 కింద దాదాపు 900 పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. పది రోజుల్లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం.

APPSC Group -2 News

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

Flash...   AP Group 2: 950 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ త్వరలో .. ఈ నిబంధనలతో