నెలకు పది వేల వరకు ఉపకార వేతనం తో IT లో ఉచిత శిక్షణ .. ఇలా అప్లై చేయండి

నెలకు పది వేల వరకు ఉపకార వేతనం తో IT లో ఉచిత శిక్షణ .. ఇలా అప్లై చేయండి

యుసిడి పిడి పాపునాయుడు మాట్లాడుతూ అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (తులిప్) డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగిన వారికి ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఇంజనీరింగ్‌తో పాటు అర్బన్ ప్లానింగ్, అర్బన్ డిజైనింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొబిలిటీ, ఫైనాన్స్, సోషల్ సెక్టార్ మరియు ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ వంటి అనేక విభాగాల్లో శిక్షణ మరియు ఉపాధి కల్పించబడుతుంది.

8 వారాల నుంచి ఏడాది వరకు కోర్సులు ఉంటాయని వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం, జివిఎంసి ద్వారా నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉపకార వేతనం చెల్లిస్తుందని తెలిపారు.

బీప్లాన్, బీటెక్, బీఆర్‌సీ, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఈఏ, ఎల్‌ఎల్‌బీ తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.

https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నగర సామాజిక అభివృద్ధి విభాగం (UCD), జివిఎంసి, జోనల్ కార్యాలయాలను సంప్రదించండి.

Flash...   PRC : ఉద్యోగుల సమస్యపై జగన్ సర్కార్ ఫోకస్: నోడల్ అధికారి నియామకం