మీ పోలింగ్ కేంద్రం ఎక్కడో ఇలా ఒక్క క్లిక్ తో కనుక్కోండి, గూగుల్ టెక్నాలజీ తో

మీ పోలింగ్ కేంద్రం ఎక్కడో ఇలా ఒక్క క్లిక్ తో కనుక్కోండి, గూగుల్ టెక్నాలజీ తో

గూగుల్ రోజురోజుకు కొత్త ఫీచర్లతో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు ఫొటోల ద్వారా యాక్టివ్‌గా ఉండే స్థాయి నుంచి నేటి వరకు ఎన్నికల పోలింగ్ బూత్‌లను చూపే స్థాయికి గూగుల్ మ్యాప్ ఎదిగింది.

ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దాని కోసం Google సేవలు ఉపయోగించబడతాయి. నేటి కాలంలో కొత్త పుంతలు తొక్కుతున్న గూగుల్ లేకుండా ఏ పనీ సాధ్యం కాదు.

అందుకే ఓటర్లు, వారి పోలింగ్ బూత్ కేంద్రాల వివరాలను అధికారులు తెలుసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం పోర్టల్‌కి వెళ్లి, సాధారణ ఎన్నికలు-2023 ఓటర్ల జాబితాలో జిల్లా పేరు మరియు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోండి. ఇందులో ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషు కూడా ఉంటుంది. దీన్ని నమోదు చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటి వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఈ వివరాలకు సంబంధించి గూగుల్ మ్యాప్ జోడించబడింది. అందులో ఓటరు ఐడీ నంబర్ కూడా కనిపిస్తుంది. దీంతో వారు తమ పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు.

Flash...   మరో వారం రోజులు ఎండలు ఇంతే.. భగ భగలకు కారణమిదే!