ESMA: ఎస్మాకి భయపడం.. పోరాటం ఆపం

 ఎస్మాకి భయపడం.. పోరాటం ఆపం

ఏపీలో ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాటం ఆపేది లేదంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్రంగా స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడారు

READ: (ESMA) ఎస్మా చట్టం ఏమిటి? దీనికి ఉన్న విస్తృతి ఎంత?

రాష్ట్ర ప్రభుత్వం తన మొండివైఖరి మానాలన్నారు. ఉద్యోగులు తమ డిమాండ్లు అంగీకరించేంత వరకు పోరాటం ఆపేది లేదని వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం చుట్టూ మూడేళ్లు తిరిగామని, ఇంకా తమను మోసం చేసే ప్రయత్నాలు చేయొద్దని అన్నారు. మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగులు ముందుకు రావడంలేదంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులకు, సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. జీతాల గురించి అధికారులు డీడీవోలపై వత్తిడి తేవడంపై ఆయన మండిపడ్డారు.

READ

ఫిబ్రవరి నెలలోSBI శాలరీ అకౌంట్ ఉన్నవారు ఒక లక్ష వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఇంటి నుంచే పొందొచ్చు 

SBI వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్!

Flash...   4 spell School Health & Wellness Programme – Under Ayushman Bharat