APMSRB : ఆంధ్రప్రదేశ్‌ లో మరో 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్వ్యూ తేదీలివే .. !

APMSRB : ఆంధ్రప్రదేశ్‌ లో మరో 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..  ఇంటర్వ్యూ తేదీలివే .. !

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని APMSRB మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా AP డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రులలో సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. (ఆంధ్రప్రదేశ్‌లో 1896 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చింది.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు)

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 150 పోస్టులు

స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్:

  • రెగ్యులర్ పోస్టులకు నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,370..
  • కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతానికి రూ.2,50,000..
  • గ్రామీణ ప్రాంతానికి రూ.2,00,000.. రూ.1,30,000 పట్టణ ప్రాంతం కోసం.

ఎంపిక ప్రక్రియ: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు: డిసెంబర్ 11, 13 మరియు 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

ఇంటర్వ్యూలు నిర్వహించే స్థలం: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్, E.No.77-21G, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://hmfw.ap.gov.in/index.aspx

Flash...   Mobile Customer ID : ఆధార్ తరహాలో సిమ్ కార్డుకూ యునిక్‌ కస్టమర్ ఐడీ.. లాభాలు ఇవే.