Business Ideas: పండుగ సీజన్‌లో పక్కా ఆదాయం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!

Business Ideas: పండుగ సీజన్‌లో పక్కా ఆదాయం.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..!

వ్యాపార ఆలోచనలు: పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇంట్లో ఉంటూనే కొంత అదనపు ఆదాయాన్నిపొందాలనుకునే వారికి ఇదే సరైన సమయం. అలాగే చిన్న ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం పొందాలనుకునే వారు కూడా దీన్ని ప్రారంభించవచ్చు.

పండుగ సీజన్‌లో మంచి ఆదాయాన్ని తెచ్చే వ్యాపారం ఒకటి ఉంది. అదే గిఫ్ట్ బుట్టల వ్యాపారం. మహిళలు తమ ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాబట్టి వారు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో రకరకాల కానుకలు ఇచ్చేందుకు ఉపయోగించే బుట్టలను తయారు చేయాల్సి ఉంటుంది. ఇవి తమ ప్రియమైన వారికి ఇచ్చే బహుమతులను మరింత అందంగా మారుస్తాయి.

వివిధ డిజైన్లు మరియు రంగులలో వినూత్నమైన బుట్టలను తయారు చేయడం ద్వారా మీరు లాభాలను పొందవచ్చు. కార్పోరేట్ కంపెనీల నుంచి అవుట్ డోర్ గిఫ్ట్ షాపుల వరకు అందరూ ఈ రోజుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చాలా తక్కువ అంటే రూ.5 నుంచి రూ.10 వేలు పెట్టుబడి పెట్టాలి. మీరు మీకు సమీపంలోని గిఫ్ట్ షాపులను సంప్రదించవచ్చు మరియు వారి అవసరాలకు అనుగుణంగా బుట్టలను తయారు చేయవచ్చు మరియు వాటిని సులభంగా మార్కెట్ చేయవచ్చు. అలాగే వీటిని అమెజాన్, ఫిప్‌కార్ట్, మీషో వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు గిఫ్ట్ బాస్కెట్ లేదా బాక్స్ రిబ్బన్, ప్యాకేజింగ్ మెటీరియల్, ప్యాకింగ్ పేపర్, లోకల్ ఆర్ట్ క్రాఫ్ట్ వస్తువులు, మార్కర్ పెన్నులు, పేపర్ ష్రెడర్, కార్టన్ స్టెప్లర్, డెకరేటివ్ మెటీరియల్, స్టిక్కర్లు, ఫాబ్రిక్ ముక్కలు, సన్నని తీగ, కత్తెర, వైర్ వంటి ప్రాథమిక అంశాలు అవసరం. కట్టర్లు, కలరింగ్ టేప్ వస్తువుల అవసరం ఉంటుంది. వీటిని ఉపయోగించి మీరు నేరుగా ఇంటి నుండే ఆన్‌లైన్‌లో మీ బహుమతుల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరు మెటీరియల్ ఖర్చు తప్ప ఎలాంటి అదనపు ఖర్చులు భరించరు.

Flash...   EMPLOYEES TRANSFERS - CERTAIN CLARIFICATIONS FROM CSE