AP Rains: ఏపీకి తుపాను ముప్పు..  డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!

AP Rains: ఏపీకి తుపాను ముప్పు..  డిసెంబరు తొలి వారంలో అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి గురువారం వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి తుఫానుగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో.

డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని… పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమలో పంటలు కోత దశలో ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరించారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Flash...   Rain Alert: తెలుగు రాష్ట్రాలకు డబుల్‌ వార్నింగ్‌.. మరో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు..!