చలికాలంలో ఎండుద్రాక్షను చిరుతిండిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. దీనిని కేకులు, ఖీర్ మరియు బర్ఫీలలో కలిపి కూడా తినవచ్చు.
ఈ డ్రై ఫ్రూట్స్ బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్, బీపీని అదుపులో ఉంచుతాయి. వీటితో మరిన్ని లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అంటే…
నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.
ఈ సీజన్లో జుట్టు పొడిగా ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు కూడా విరిగిపోతాయి. ఈ సమస్య తగ్గాలంటే రోజూ కొన్ని నల్ల ఎండుద్రాక్షలను తినండి.
వీటిలోని ఐరన్ మరియు విటమిన్ సి రక్తానికి పోషకాలను అందిస్తాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలోని ఐరన్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
రోజూ కొన్ని నల్ల ఎండుద్రాక్షలను తినడం వల్ల రుతుక్రమంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. వీటిలోని ఫైటోకెమికల్స్ నోటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.