PRC NEWS: ఫిట్‌మెంట్‌‌పై ముగిసిన సీఎం సమీక్ష

ఫిట్‌మెంట్‌‌పై ముగిసిన సీఎం సమీక్ష


అమరావతి: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష ముగిసింది. పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా పలు డిమాండ్ల పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్ ఇవ్వాలనే అంశంపై సీఎం సమాలోచనలు జరిపారు. ఎంత శాతం ఫిట్‌మెంట్ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎం జగన్‌కు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ మరోసారి చర్చలు జరుపనున్నారు. అనంతరం ఫిట్‌మెంట్‌ ఖరారు చేసే అవకాశం ఉంది.

Read: ఎంత ఫిట్మెంట్ కి మీ బేసిక్ ఎంత ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి 

CM YS Jagan: విద్యాశాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్ తదితరులు హాజరయ్యారు.

నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని  అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలన్నారు. నాడు-నేడు తర్వాత పెరిగిన పిల్లల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం  ఆదేశించారు.

Flash...   BEL : బెల్ లో ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు..ఎవరు అర్హులో చూడండి