TEA: ముఖంపై ముడతలు రావొద్దంటే రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు..

 ముఖంపై ముడతలు రావొద్దంటే రోజు ఈ టీ తాగితే చాలు..! యవ్వనంగా కనిపిస్తారు..

Tea:టీ అంటే ఇష్టమున్నవాళ్లకు అది ఒక టానిక్. అది తాగిన తర్వాతే రోజు ప్రారంభమవుతుంది. దీని సహాయంతోనే అల్పాహారం వారి శరీరానికి చేరుతుంది. అలసిపోయినప్పుడు వారికి శక్తిని ఇస్తుంది. టీ ద్వారా చాలా మందితో స్నేహం ఏర్పడుతుంది. అయితే చాలా మంది నిపుణులు టీ తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ టీ వల్ల చాలా ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. కానీ వీటిని పొందడానికి మీరు మీ టీలో కొంచెం మార్పు చేయాలి.

సంప్రదాయ పాల టీ కాకుండా బ్లాక్ టీ తాగాలి. సంప్రదాయ టీని ఎక్కువగా తాగడం వల్ల మీ చర్మం నిస్తేజంగా మారుతుంది. అయితే బ్లాక్ టీ మీ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, యాంటీ యాక్నే, యాంటీ బ్యాక్టీరియల్, క్యాటెచిన్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇది మీ చర్మంపై వయస్సు ప్రభావాన్ని అనుమతించదు. అన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది. టీ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. వృద్ధాప్యం దరిచేరనివ్వదు

బ్లాక్ టీ తాగడం వల్ల మీ చర్మంపై వయస్సు ప్రభావం కనిపించదు. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్, యాంటీ రింకిల్ గుణాలు మీ చర్మాన్ని బిగుతును ఉంచి మెరిసేలా చేస్తాయి. దీని వల్ల మీరు చాలా కాలం యవ్వనంగా కనిపిస్తారు.

చదవండి : గుమ్మడికాయ గింజలు వల్ల  ఉపయోగం తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు 

2. వాపు

చర్మంపై వాపులు ఉంటే బ్లాక్ టీ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. బ్లాక్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా చర్మం వాపు తగ్గుతుంది.

3. మచ్చలు

చర్మంపై మచ్చలు కనిపిస్తే బ్లాక్ టీ తాగడం వల్ల ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. బ్లాక్ టీలో ఉండే పాలీఫెనాల్స్ చర్మంపై ఉండే అవాంచిత మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

Flash...   నెలకు 80 రూపాయలకే అపరిమిత కాల్స్, రోజుకు 2 GB డేటా.. BSNL అద్భుత ప్లాన్!

చదవండి : గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు

4. ఇన్ఫెక్షన్

బ్లాక్ టీ చర్మ వ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీలో కాటెచిన్ అనే మూలకం ఉంటుంది. ఇది యాంటీబాక్టీరియల్‌గా పరిగణిస్తారు. ఇది చర్మ వ్యాధులను తొలగించడంలో తోడ్పడుతుంది.

5. బ్లాక్ టీ ఎలా తయారు చేయాలి..?

బ్లాక్ టీ చేయడానికి రెండు కప్పుల నీటిని సన్నని మంట మీద మూడు నిమిషాలు మరిగించాలి. తరువాత మంటను ఆపివేసి అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్‌ చేయాలి. రెండు నిమిషాల తర్వాత వడగట్టి తాగాలి. కావాలంటే ఈ టీలో నిమ్మ, తేనె కలుపుకోవచ్చు. చలికాలంలో అల్లం కూడా ఇందులో ఉపయోగించవచ్చు. అయితే చక్కెర మాత్రం కలపకూడదు.

 చదవండి : చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు…