Paytm offer: PAYTM అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్… రేపటి వరకే ఛాన్స్

 Paytm offer: PAYTM అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్… రేపటి వరకే ఛాన్స్

Paytm Offer :  మీరు పేటీఎం అకౌంట్ ఉపయోగిస్తున్నారా? పేటీఎం నుంచి రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పేటీఎం యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీరు క్యాష్‌బ్యాక్, క్యాష్‌బ్యాక్ పాయింట్స్ (Cashback Points) పొందొచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకే. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

1. పేటీఎం వావ్ వ్యాలెట్ డేస్ (Wow Wallet Days) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ డిసెంబర్ 25న ముగుస్తుంది. ఈ ఆఫర్ ద్వారా పేటీఎం యూజర్లు గిఫ్ట్ వోచర్ పొందొచ్చు. వ్యాలెట్‌లో డబ్బులు లోడ్ చేస్తే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇతర లావాదేవీలు జరిపితే క్యాష్‌బ్యాక్ పాయింట్స్ లభిస్తాయి. క్యాష్‌బ్యాక్ పాయింట్స్‌ని రీడీమ్ చేసుకోవచ్చు

2. పేటీఎం యూజర్లు వావ్ వ్యాలెట్ డేస్ ఆఫర్‌లో భాగంగా వ్యాలెట్‌లో డబ్బులు లోడ్ చేస్తే వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందుకోసం మీ పేటీం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాలి. హోమ్ డ్యాష్‌బోర్డ్‌లో Paytm Wow Wallet Days Offer బ్యానర్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత డబ్బులు లోడ్ చేయాలి. మీకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది

3. మీరు రూ.1,000 లోడ్ చేస్తే రూ.10 క్యాష్‌బ్యాక్, రూ.2,000 లోడ్ చేస్తే రూ.20 క్యాష్‌బ్యాక్, రూ.3,000 లోడ్ చేస్తే రూ.30 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ పాయింట్స్ ఆఫర్ కూడా ఉంది. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, ఆజియో, మింత్రా, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, జియోమార్ట్, ఊబెర్, 1ఎంజీ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పేటీఎంతో లావాదేవీలు జరిపితే 10,000 వరకు క్యాష్‌బ్యాక్ పాయింట్స్ లభిస్తాయి

4. పేటీఎం క్యాష్‌బ్యాక్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ లాంటివి. ఈ పాయింట్స్‌ని మీరు పేటీఎంలోనే వేర్వేరు బ్రాండ్ల వస్తువులు, సర్వీసులు కొనడానికి లేదా రీఛార్జ్ చేయడానికి ఉపయోగించొచ్చు. ఎన్ని పాయింట్స్ ఎక్కువగా ఉంటే యూజర్లకు అంత లాభం. 

Flash...   NEW RULES: JANUARY 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!

5. ఇక పేటీఎం ఇటీవల రెంటల్ సర్వీసులకు పేమెంట్స్ ప్రారంభించింది. ఫంక్షన్ హాల్ అద్దె, కేటరింగ్, డెకరేషన్, కార్ రెంట్, ఫర్నీచర్ రెంట్, గెస్ట్ హౌజ్ రెంట్ లాంటి వాటికి పేటీఎం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ సేవలకు పేటీఎం ద్వారా పేమెంట్ చేస్తే రూ.10,000 విలువైన క్యాష్‌బ్యాక్ పాయింట్స్ లభిస్తాయి. 

6. ఇప్పటికే ఇంటి అద్దె, ప్రాపర్టీ డిపాజిట్, బ్రోకరేజ్ ఫీజ్, షాప్ రెంటల్స్, టోకెన్ మనీ లాంటి వాటికి పేమెంట్స్ ఆప్షన్స్ అందిస్తోంది పేటీఎం. వీటితో పాటు పేటీఎం యూపీఐ, పేటీఎం పోస్ట్‌పెయిడ్ అంటే బయ్ నౌ పే లేటర్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని కూడా పేటీఎం అందిస్తుండటం విశేషం

7. పేటీఎం ద్వారా యూజర్లు మొబైల్ రీఛార్జ్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్, డీటీహెచ్ రీఛార్జ్, పాలసీ ప్రీమియం పేమెంట్, మనీ ట్రాన్స్‌ఫర్, ఫ్లైట్ టికెట్ బుకింగ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, మూవీ టికెట్స్ బుకింగ్ లాంటివన్నీ చేయొచ్చు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు పేటీఎం ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు/

MORE HERE