Group 2 – Free Coaching : గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Group 2 –  Free Coaching : గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ


గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత కోచింగ్ కోసం అర్హులైన డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారిణి లక్ష్మీదేవమ్మ, ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కర్నూలు డైరెక్టర్ వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు అర్హులని, ఈ నెల 26వ తేదీలోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ కల్లూరు, తహసీల్దార్‌ కార్యాలయం, అబ్బాస్‌ నగర్‌, కర్నూలు అనే చిరునామాకు తపాలా ద్వారా దరఖాస్తులను పంపాలన్నారు.

డిగ్రీ మెరిట్ ఆధారంగా 45 రోజుల ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులకు శిక్షణ కాలం పూర్తయిన తర్వాత స్టైఫండ్ మంజూరు చేయబడుతుంది. ఇతర వివరాలకు 08518 236076 నంబర్‌లో సంప్రదించవచ్చు

Flash...   ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇయర్ బడ్స్! ధర మీరు ఊహించలేనంత..