TECHNO : బడ్జెట్‌ ధరలో 108 ఎంపీ కెమెరా.. టెక్నో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.

TECHNO : బడ్జెట్‌ ధరలో 108 ఎంపీ కెమెరా.. టెక్నో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.

. టెక్నో స్పార్క్ 20 ప్రోకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్ కొన్ని అధునాతన ఫీచర్లను అందిస్తుంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా క్వాలిటీతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు. కంపెనీ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? ధర ఎంత? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో వరుస స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. టెక్నో తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఫోన్‌లను తీసుకువస్తోంది. మొన్న టెక్నో స్పార్క్ 20 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన టెక్నో కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ కు కొనసాగింపుగా టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ ఫోన్ ను తీసుకొస్తోంది. ఈ ఫోన్ వచ్చే జనవరిలో మార్కెట్లోకి విడుదల కానుంది.

ఈ క్రమంలో ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. టెక్నో స్పార్క్ 20 ప్రోకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్ కొన్ని అధునాతన ఫీచర్లను అందిస్తుంది. తక్కువ బడ్జెట్ లో మంచి కెమెరా క్వాలిటీతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు. కంపెనీ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి? ధర ఎంత? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

టెక్నో స్పార్క్ 20 ప్రో+ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డిస్‌ప్లే 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని విడుదల చేస్తుంది. ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. 108 మెగాపిక్సెల్‌తో కూడిన అరుదైన కెమెరాను అందించారు. ఇది సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది.

నిలువు LED ఫ్లాష్ యూనిట్ అందించబడింది. ఈ ఫన్‌లో ప్రత్యేకంగా డబుల్ కర్వ్డ్ డిజైన్ అందించబడింది. దీంతో వినియోగదారులు ఫోన్‌ను చాలా సౌకర్యవంతంగా పట్టుకోవచ్చని కంపెనీ తెలిపింది. బెజెల్ లెస్ డిజైన్ తో తయారైన డిస్ ప్లే ఫోన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సెంటర్డ్ పంచ్ హోల్ ఫ్రంట్ కెమెరా కూడా అందించబడుతుంది.

Flash...   SUKANYA SAMVRUDDI YONANA: SSY: ఈ స్కీమ్ లో చేరితే మీ అమ్మాయి పెళ్లి నాటికి రూ.65 లక్షలు..!

ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అలాగే మెమరీ కార్డ్‌తో స్టోరేజీని పెంచుకోవచ్చు.

టెక్నో స్పార్క్ 20 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే, ఇది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 mAh బ్యాటరీతో అందించబడుతుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో హాట్‌స్పాట్, బ్లూటూత్, వై-ఫై, USB C పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12,000 నుండి రూ. 15,000 మధ్య ఉండవచ్చని అంచనా.