Honor X50 Pro 5G : 108MP కెమెరా 5800mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. అందుబాటు ధరలో కూడా !

Honor X50 Pro 5G : 108MP కెమెరా 5800mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల..  అందుబాటు ధరలో కూడా !

Honor కొన్ని నెలల క్రితం Honor 90 5G Smart Phone‌ను విడుదల చేసింది.

ఈ ఫోన్‌కు మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే HOINOR తాజాగా మరో కొత్త హ్యాండ్ సెట్ ను విడుదల చేసింది.

HOINOR X50 Pro Smart Phone చైనాలో లాంచ్ అయింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Honor X50 Pro Specifications:

ఈ Honor కొత్త Smart Phone Android 13 ఆధారిత MagicOS 7.2 పై రన్ అవుతుంది. మరియు ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌ని కలిగి ఉంది. ఫలితంగా ఈ ఫోన్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలుస్తోంది. అయితే ఆండ్రాయిడ్ మాత్రం కొన్నాళ్ల పాటు అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తుందని తెలుస్తోంది.

Honor X50 Pro 5G Display:

HOINOR Smart Phone 6.78-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్, 10 బిట్ స్క్రీన్ వంటి మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే మెరుగైన అనుభూతిని ఇస్తుంది. Smart Phone గరిష్టంగా 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ప్రారంభించబడింది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

108MP Main Camera:

Honor X50 Pro 5G Smart Phone వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇది 108MP Main Camera మరియు 2MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ఇందులో క్వాలిటీ ఫోటోగ్రఫీ ఉందని తెలుస్తోంది. ఇది సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది.

5800mAh battery capacity:

HOINOR నుండి వచ్చిన ఈ కొత్త హ్యాండ్‌సెట్ మెరుగైన కెమెరాలతో పాటు అధిక బ్యాటరీ సామర్థ్యాన్ని ప్యాక్ చేస్తుంది. Smart Phone 35W Flash Charging సపోర్ట్‌తో 5800mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ NFC, USB-C పోర్ట్, వైఫై, GPS వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Flash...   Discount on Phone: అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఆకట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్..

Honor X50 Pro 5G Smart Phone చైనాలో Green మరియు Midnight Black రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర 2799 యువాన్. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.33,642. అయితే, ఈ Smart Phone భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే సమాచారాన్ని HOINOR వెల్లడించలేదు.