Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.. ఎలన్ మస్క్

 Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.. ఎలన్ మస్క్

Elon Musk on Parag Agrawal: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. చీఫ్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి
తెలిసిందే

సీఈ‌వోగా ఉన్న ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం
పదవీ నుంచి దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా
పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా నియమించింది.
2006 నుంచి డోర్సే ట్విట్టర్‌ సార‌థిగా కొన‌సా‌గు‌తూ వస్తున్నారు. అయితే..
ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్
స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా
ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.


గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు
నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ
ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్-పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ CEOగా సుందర్
పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. అలాంటి ప్రముఖ US టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా
అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది
స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని
కొనియాడుతున్నారు.

Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks, and now Twitter run by CEOs who grew up in India. Wonderful to watch the amazing success of Indians in the technology world and a good reminder of the opportunity America offers to immigrants. 🇮🇳🇺🇸 (Congrats, @paraga!)

— Patrick Collison (@patrickc) November 29, 2021


ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, 

Flash...   JEE MAINS SESSION 1 ANSWER KEY RELEASED

మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, 

అడోబ్
సీఈఓగా శాంతను నారాయణ్, 

ఐబీఎంకు అరవింద్ కృష్ణ నాయకత్వం వహిస్తున్న సంగతి
తెలిసిందే.

 తాజాగా వారి సరసన పరాగ్ అగర్వాల్ చేరారు. అగర్వాల్ 2011లో కంపెనీలో
చేరారు. అక్టోబర్ 2017 నుంచి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో PhD, ఇండియన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో
బ్యాచిలర్ డిగ్రీని పొందారు.