OnePlus Nord 3: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. నార్డ్‌3పై భారీ డిస్కౌంట్‌..

OnePlus Nord 3: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. నార్డ్‌3పై భారీ డిస్కౌంట్‌..

OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది.

వీటిలో ఒకటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కాగా, మరొకటి 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్. ఈ ఫోన్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే రంగులలో లభిస్తుంది.

డిస్కౌంట్ విషయానికొస్తే, 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,999 మరియు డిస్కౌంట్‌లో భాగంగా రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు. మరియు 12 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 ప్రస్తుతం తగ్గింపు రూ. 33,999 పొందవచ్చు.

OnePlus Nord 3 ఫీచర్ల విషయానికొస్తే, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షన్ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6.74-అంగుళాల AMOLED డిస్ప్లేను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌లతో కూడిన ఫ్రంట్ కెమెరా అందించబడింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది, ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే, 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ V5.3, NFC, GPS, USB టైప్-సి పోర్ట్ అందించబడ్డాయి. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించబడింది.

Flash...   రూ.5 వేల పెట్టుబడితో రూ.5.50 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌!