Whatsapp Spam : పొరపాటున కూడా ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ ఎత్తకండి..

Whatsapp Spam : పొరపాటున కూడా ఈ నంబర్ల నుండి వచ్చే కాల్స్ ఎత్తకండి..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు మరింత అధునాతనమవుతున్నారు. కొత్త తరహా నేర వ్యవస్థను పెంచుతున్నారు. గుర్తుతెలియని నంబర్లతో వీడియో కాల్స్ చేస్తూ ఫేస్ బుక్ వీడియోలు తీసుకోని వారిని అసభ్యకర వీడియోలుగా మార్చి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు.

ఈ తరహా నేరాలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. విదేశీ కోడ్ నంబర్ల నుంచి కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను ఉచ్చులోకి నెట్టుతున్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్, మెయిల్, సెల్‌ఫోన్లలో వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాలపై ఎలాంటి హెచ్చరిక చర్యలు తీసుకున్నారు

చాలా మంది అమాయకులు నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. గత కొన్ని నెలలుగా, +84, +62, +60తో ప్రారంభమయ్యే వాట్సాప్ నంబర్‌ల నుండి చాలా మంది కాల్స్ ద్వారా ట్రాప్ అవుతున్నారు. మలేషియా, కెన్యా, వియత్నాం మరియు ఇథియోపియా నుండి ఈ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఐఎస్‌డి నంబర్‌ల నుంచి వచ్చే వీడియో కాల్‌లతో పాటు ఇండియన్ కోడ్ ఉన్న నంబర్‌ల నుంచి వచ్చే తెలియని కాల్‌లు నేరాలకు పాల్పడుతున్నాయి.

ఈ తరహా స్కామ్‌ల గురించి వాట్సాప్‌లో మీకు ఏదైనా తెలియని నంబర్ నుండి కాల్ వస్తే, దానిని అంగీకరించవద్దు. కాల్‌ని తిరస్కరించిన తర్వాత, వెంటనే రిపోర్ట్ చేసి, అటువంటి నంబర్‌ను బ్లాక్ చేయాలని సూచించబడింది. అంతే కాకుండా ఉద్యోగాల పేరుతో కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాంటి నంబర్లను బ్లాక్ చేయాలి. అలాంటి స్పామ్ కాల్స్ కోసం ఇటీవల వాట్సాప్ 4.7 మిలియన్ ఖాతాలను బ్లాక్ చేసింది.

Flash...   పెండింగు జీతం జనవరిలోనే చేతికి