AP లో MLC ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 

అమరావతి: రాష్ట్రంలోని స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌‌ను అధికారులు విడుదల చేశారు. విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండు స్థానాలకు  నోటిఫికేషన్‌ వెలువడింది. అనంతపురం, కర్నూలు, తూ.గో, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి నోటిఫికేషన్‌‌ను విడుదల చేశారు. ఈనెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 24న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈనెల 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్‌ 10న పోలింగ్ జరుగుతంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Flash...   Apple AirPods: ఎయిర్ పాడ్స్ కనెక్ట్ అవడం లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..