Kiwi Health Benefits: ప్రతి రోజూ కివి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులివే!

Kiwi Health Benefits: ప్రతి రోజూ కివి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులివే!

కివీ పండ్లు ఇప్పుడు ప్రతి మార్కెట్లోనూ దర్శనమిస్తున్నాయి.

కొన్నేళ్ల క్రితం వరకు ఈ పండు పేరు చాలా మందికి తెలియదు. కివీ రుచికి మాత్రమే కాదు, మంచి పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది.

కివిలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది.శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కివిలో పాలీఫెనాల్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ప్రస్తుతం ప్రతి మార్కెట్లోనూ ఈ పండ్లు దర్శనమిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు ఈ పండు పేరు చాలా మందికి తెలియదు. కివీ రుచికి మాత్రమే కాదు, మంచి పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. కివిలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది.శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

కివిలో పాలీఫెనాల్స్ మరియు కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహాయపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కివీని ప్రతిరోజూ తినడం వల్ల సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. కివి ముఖ్యంగా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువ.

ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు కివీని తినాలి. కివీపండులోని డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు పొట్టను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

కివీలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పండు చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కివీలోని పోషకాలు మచ్చలు మరియు మొటిమల సమస్యలను తగ్గిస్తాయి.

Flash...   ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన పండు ఇదే.. ఈ జ్యూస్ తాగితే వృద్ధాప్యం మీ దరికి చేరదు..!

ఈ పండులోని ఎలక్ట్రోలైట్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక వారం పాటు కివీ తినడం వల్ల మీ లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్) సాధారణ స్థాయికి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కివి తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ కె ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, కివి తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.