Immunity: రోగ నిరోధక శక్తి ని చలికాలంలో ఇలా పెంచుకోండి..!

రోగ నిరోధక శక్తి  ని చలికాలంలో ఇలా పెంచుకోండి..!

ఆరోగ్యంగా
ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా చాలా ముఖ్యం.
కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి చాలా మంది ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎన్నో
మార్గాలని అనుసరించారు. చలి కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి

అలాంటి సమస్యలు
రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండాలి. చలికాలంలో ఎక్కువగా గొంతు
నొప్పి
, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. రోగనిరోధక శక్తి
ఎక్కువగా ఉంటే వీటి వల్ల మనకి అంత ఇబ్బంది ఉండదు. అయితే చలికాలంలో ఈ ఆహార
పదార్థాలను తీసుకుని రోగ నిరోధక శక్తి పెంచుకోండి.

సిట్రస్:

సిట్రస్ పండ్లు
తీసుకోవడం వల్ల విటమిన్ సి వస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సిట్రస్
ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల ఫిట్ గా ఉండొచ్చు మరియు ఆరోగ్యంగా ఉండొచ్చు. కమల, నిమ్మ, ద్రాక్ష మొదలైన వాటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి
ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుడ్లు:

చలికాలంలో
అల్పాహారం కింద గుడ్లు తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్ డి, విటమిన్ సి
ఉంటాయి. అలానే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

అల్లం:

అల్లం లో కూడా
మంచి పోషక పదార్థాలు ఉంటాయి. వికారం, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడానికి ఇది
బాగా ఉపయోగపడుతుంది. మీరు దీనిని టీ లో లేదా సూప్స్ వంటి వాటిలో వేసుకుని
తీసుకోవచ్చు. తద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

జామకాయ:

జామ లో విటమిన్
సి, యాంటీ
ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. గుండె
ఆరోగ్యానికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కి ఇది చాలా మేలు చేస్తుంది ఇలా వీటిని తీసుకుని
రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Flash...   G.O.Ms.No.24 Dt:25-05-2022: Rationalization, surrender and transfer of aided staff - Amendment to APEIS Rules