Heart Care : ఇండియా లో గుండె సమస్యలు అందుకే ఎక్కువ.. WHO ఏం చెబుతోందంటే..

Heart Care : ఇండియా లో గుండె సమస్యలు అందుకే ఎక్కువ.. WHO ఏం చెబుతోందంటే..
ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండేవి.. కానీ ఇప్పుడు 10 ఏళ్లు కూడా నిండకుండానే గుండె జబ్బులు వస్తున్నాయి.
 
అప్పటి వరకు ఉల్లాసంగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. కరోనా తర్వాత కూడా గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
 
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల హృద్రోగ సమస్యలు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడమే గుండె జబ్బులకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసేవారిలో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇదిలావుండగా, గుండె జబ్బులకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక విషయాలను వెల్లడించింది. WHO ప్రకారం, వ్యాయామం లేకపోవడం వల్ల భారతీయులలో హృదయ సంబంధ సమస్యలు చాలా సాధారణం.
 
ఒక వ్యక్తి వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ యాభై శాతానికి పైగా భారతీయులు వ్యాయామం చేయరు. అందుకే భారతదేశంలో గుండె జబ్బుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. 150 నిముషాలు గణించలేకపోవడం, రోజుకు 30 నిమిషాలు కేటాయించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు మనం నడిచే దశలను లెక్కించే మొబైల్ యాప్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
 
వ్యాయామం వల్ల గుండె జబ్బులు నిజంగా తగ్గుతాయనే అంశంపై అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. భారత్ సహా 42 దేశాలకు చెందిన 20 వేల మంది వ్యాయామ వివరాలను పరిశీలించారు. ప్రతిరోజూ 6 నుంచి 9 వేల అడుగులు నడిచే వారిలో గుండె జబ్బుల సమస్యలు 60 శాతం తగ్గాయని పరిశోధకులు తేల్చారు. ఇదిలా ఉంటే భారతీయులు ముఖ్యంగా ఉద్యోగ విరమణ పొందిన వారు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని, అలాంటి వారు తమ అడుగులు లెక్కపెట్టుకుని ఇలా నడిస్తే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.
Flash...   Papaya: బొప్పాయి తిన్న తర్వాత ఈ ఆహారాలు తినకూడదు.. అవేంటంటే