Aadhaar Card: ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్.. గడువు పొడగిస్తూ నిర్ణయం..

Aadhaar Card: ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్.. గడువు పొడగిస్తూ నిర్ణయం..

గత పదేళ్లుగా ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోని వారి కార్డులు చెల్లవని గుర్తిస్తామని అధికారులు తెలిపారు. అందుకే ఆధార్ వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

అడ్రస్, ఫోన్ నంబర్, పేరు మార్పులు, ఫొటో ఇలా ఏవైనా ఉంటే వాటిని అప్ డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.దీంతో ఆ వ్యక్తి ఆధార్ కార్డు వినియోగిస్తున్నట్లు తెలుస్తుందనేది అధికారుల ఉద్దేశం.

కాగా, ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది. పలుమార్లు గడువును పొడిగించిన అధికారులు తాజాగా మరోసారి చివరి తేదీని పొడిగించారు.

ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా, గడువు మార్చి 31 వరకు పొడిగించబడింది. వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్లోని వివరాలను అప్డేట్ చేయడానికి, ముందుగా అధికారిక వెబ్సైట్ https://myaadhaar.uidai.gov.in/కి వెళ్లండి.

ప్రస్తుత ఆధార్ కార్డ్ నంబర్ను నమోదు చేసినట్లయితే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపిన OTPని నమోదు చేసి ధృవీకరించాలి.

అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ప్రక్రియను ఎంచుకోండి.

ఆధార్ కార్డ్లో అవసరమైన వివరాలను అప్డేట్ చేయడానికి కొనసాగండి.

మీ అప్డేట్ స్థితిని తనిఖీ చేయడానికి 14 అంకెల URN నంబర్ను సిద్ధంగా ఉంచండి

Flash...   ADHAR UPDATE: 10 ఏళ్ల క్రితం ఆధార్ తీసుకున్నారా.. వెంటనే ఇలా చేయండి.. UIDAI కీలక ప్రకటన..