పాముకు చెవులు ఉండవు, మరి ఎలా వినగలవు ?

 పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?


జవాబు: మనిషిలాంటి వెన్నెముక గల జీవుల శ్రవణేంద్రియంలో బాహ్య చెవి (తలకు చెరో పక్క డొప్పలా ఉండేవి), మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి. ఇందులో కర్ణభేరి అనే పలుచని పొరపై పడిన ధ్వని తరంగాలను మధ్య చెవిలో ఉండే మాలియస్‌, అంకస్‌, స్టెవీన్‌ అనే చిన్న ఎముకలు లోపలి చెవికి చేరవేస్తాయి. కొన్ని జీవులలో ‘కర్ణస్తంభిక’ అనే ఎముక కర్ణభేరిని లోపలి చెవితో కలుపుతుంది.

పాముల విషయానికి వస్తే, వాటికి బాహ్యచెవులు, కర్ణభేరి ఉండవు. కాని లోపల చెవి ఉంటుంది. కర్ణస్తంభిక ఒక వైపు పాము లోపలి చెవికి అనుసంధానమై ఉంటే, మరో వైపు చర్మానికి కలిపి ఉంటుంది. పాము చర్మం నేలకు తాకి ఉండటం వల్ల నేలలో పయనించే ధ్వని తరంగాలను మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి అందజేయగలుగుతుంది.

గాలిలో పయనించే ధ్వని తరంగాలు పాముకు ఏ మాత్రం వినబడవు. ఆ రకంగా అది ‘పుట్టు చెవిటిదనే’ చెప్పుకోవచ్చు. మరి నాగ స్వరం వూదుతుంటే పాము ఎందుకు తలాడిస్తుందంటే?నాగ స్వరం వూదే ముందు పాములవాడు చేతితో నేలను చరుస్తాడు. ఆ శబ్ద తరంగాలు పాము చర్మం ద్వారా లోపలి చెవికి చేరి పాము పడగ విప్పుతుంది. ఆ తర్వాత నాగ స్వరాన్ని వూదుతున్న బూరాని చూస్తూ దాన్ని ఎటుకేసి తిప్పితే అటు పడగ ఆడిస్తుంది. బూరాను కాటు వేయాలనే ఉద్దేశంతోనే తప్ప, సంగీతానికి మైమరచి మాత్రం కాదు. బూరా బదులు ఒక గుడ్డను చేతితో ఆడించినా పాము ఆలానే తలాడిస్తుంది.

HOW DO SNAKES HEAR WITHOUT EARS?

You may think snakes are deaf since they do not possess external ears, but it has been discovered in studies by J. Leo van Hemmen and Paul Friedel of the Technical University of Munich, Germany, and the Bernstein Center for Computational Neuroscience that snakes can indeed hear to some extent.

Flash...   Baldness:: పురుషులకు మాత్రమే బట్టతల ఎందుకు వస్తుంది? ఆడవారికి ఎందుకు రాదు .. ఇదే కారణం

No Eardrum

Snakes do not have eardrums, but they do have inner ear structures complete with cochleas and are able to hear by feeling the vibrations alongside their jaws as they slither on the ground. The left and right sides of snakes’ jaws can move independently of each other. As a result, snakes can sense vibrations from either the left side or the right, helping to determine where sounds originate.

Mechanoreceptors

Mechanoreceptors are sensory nerves spaced throughout the skin of the body and connected to the spinal cord, enabling a snake to feel vibrations that carry through the sand or soil. These vibrations move through the body and along the spinal nerves to the brain, where they are recognized as sounds. These receptors are extremely sensitive and they react instantly to stimuli, enabling a snake to locate the source of the sound.

Sound Moving Through the Air

A snake can pick up sound waves through the air, because the skull vibrates when a sound wave hits it. But a snake appears to hear low notes easier than high ones. These impulses move directly from the skull into the snake’s inner ears, where the vibrations are sensed by the brain. Some snake owners believe their pets are capable of reacting to the sound of their names.

Flash...   పుట్టగొడుగులు ఎలా పుడతాయి ?, how are mushrooms born ?

Extremely Sensitive Perception

Snakes can sense something moving on the surface of sand or soil from great distances and pinpoint its location easily through sound waves. These waves are tiny ripples on the sand that radiate away from the source at a rapid pace — around 50 meters a second. Sensitive vibratory reception is common in snakes and enables them to catch prey easily.