Gurukulam School Admissions 2024 : గురుకులం పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Gurukulam School Admissions 2024 : గురుకులం పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్

బాలికల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు.

5వ తరగతిలో 80, ఇంటర్లో 80 సీట్లు ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23లోగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

SC మరియు ST విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశానికి సెప్టెంబర్ 1, 2011 మరియు ఆగస్టు 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. BC కన్వర్టెడ్ క్రిస్టియన్ (BCC), OC 1 సెప్టెంబర్ 2013 మరియు 31 ఆగస్టు 2015 మధ్య జన్మించి ఉండాలి. తండ్రి లేదా సంరక్షకుల ఆదాయ పరిమితి సంవత్సరానికి లక్షకు మించకూడదు.

ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వచ్చే నెల 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్కు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు 95509 64542, 92460 49529, 81868 97867 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ నాగమణి కోరారు.

Flash...   AP లో 2250 ఎస్సై , కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇపుడే అప్లై చేయండి .. పూర్తి వివరాలు ఇవే..