ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా డైరెక్టర్ల నియమకంలోనూ పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. మహిళలకు 52 శాతం అవకాశం కల్పించామన్నారు. ఓసీలకు 42 శాతం పదలిచ్చామని తెలిపారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల అన్నారు.
మహిళలకు 52 శాతం పదవులు: సుచరిత
మహిళలకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు.
ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్ల నిమామకంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. కొంతమంది కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన దాన్ని పదవి అనుకోకుండా బాధ్యతలా పని చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పేర్కొన్నారు