Teacher Suspenssion : పాఠాలు సరిగా చెప్పడంలేదని టీచర్ సస్పెన్షన్.. మరో ఇద్దరికి నోటీసులు


చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 11: సిలబస్ పూర్తయ్యేలా పాఠాలు చెప్పడంలేదంటూ జిల్లాలో ఒక టీచర్ను సస్పెండ్ చేశారు. గుడిపాల మండలం పానాటూరు ఎంపీయూపీ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) ఎన్.శి వప్రకాష్ లెసెన్ ప్లాన్ సరిగ్గా రాయకపోవడం, పూర్తి చేయాల్సిన సిలబస్ కన్నా తక్కువ చెప్పడం, విద్యార్థులతో వర్క్ బుక్ లు చేయించకపోవడం, ట్యాబ్ ల్లోని మ్యాథ్స్ పిల్లలకు నేర్పించకపోవడం వంటి కారణాలతో సస్పెండ్ చేసినట్లు DEO  విజయేంద్రరావు తెలిపారు.

 శనివారం గుడి పాల మండలం పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ఇదే పాఠశాలలో గతంలో స్కూల్ అసి స్టెంట్ (SOCIAL)గా పనిచేసిన N. వెంకటేశ్వర్లు ఎలాంటి పురగోతి చూపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వేరే పాఠశాలకు బదిలీపై వెళ్లారు. ఇక ఇదే పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (TELUGU) C.మనోహర్ నాయుడికి కూడా షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు DEO తెలిప్పారు. ఆయన సరిగా పనిచే యడం లేదని, విద్యార్థులకు పాఠశాలు చెప్పడంలేదని పేర్కొన్నారు.

Flash...   PRC ఇవ్వాలన్న ఉద్దేశం ఉందా?