Why Ash color is in white ? బూడిద తెల్లగా ఉంటుందేం?

ప్రశ్న: బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.

బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.

Why does coal become white after burnt?

The carbon in the coal reacts with oxygen to produce CO2. What is left has been produced from the materials other than carbon. Correctly, coal ash is made up of fly ash (which is carried away by the flow of air but can be caught in the chimney) and bottom ash. A lot of the material that could not be burned was clay, sand, and other minerals. Some minerals (e.g. iron sulphides) break down and, in that case, sulfur dioxide leaves and the iron reacts with other materials. Some minerals melt and glass remains after the fire. There are metal oxides, iron silicates, aluminum silicates, MgO, silica. These are dominantly grey in color and so is the ash.

Flash...   నిద్ర లో పక్షులు పట్టు జారిపోవు ఎందుకని? Why Birds Do Not Fall From Trees While Sleeping