Andhra Pradesh: జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పౌష్టికాహారం.. మార్చి 2 నుంచి

AP: New item in MDM జగనన్న గోరు ముద్ద మెనూలో మరో పౌష్టికాహారం.. మార్చి 2 నుంచి


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ‘జగనన్న గోరు ముద్ద’ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గుడ్డు, కోడిపిల్ల, పొంగల్ వంటి అనేక పౌష్టికాహారాలను అందజేస్తున్నారు. వారం రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేస్తున్నారు. అయితే తాజాగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనింకి సంబంధిచి ఆల్రెడీ IMMS APP నందు మార్పులు చేస్తూ కొత్త వెర్షన్ ని కూడా విడుదల చేశారు 

జగనన్న గోరు ముద్దలో మరో పోషకమైన రాగి బెల్లం కలుపుతారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావను వడ్డిస్తున్నామని.. పిల్లల్లో ఐరన్, క్యాల్షియం లోపాన్ని నివారించేందుకు రాగుజావను కలుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ పాల్గొనబోతోంది. ఇందులో భాగంగా గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు.

Download Latest IMMS App here  

Flash...   రుతుపవనాలు: చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి..