CARONA TENSION IN SCHOOLS: ఏపీ బడుల్లో కరోనా టెన్షన్…!

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా టెన్షన్ పట్టుకుంది. పశ్చిమ
గోదావరి, కృష్ణా జిల్లాల్లోని బడుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. విజయనగరం
జిల్లా బొబ్బిలిలో కరోనా కలకలం రేగింది. జయప్రకాష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో
కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు
రిపోర్టు వచ్చింది.

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12కు
చేరింది. పీవీఆర్ బాలికల హైస్కూల్‌లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు, ఓ ఎనిమిదవ
తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఒంగోలు
డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు,
ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు
కరోనా బారిన పడుతున్నారు. దీంతో తోటి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది ఆందోళన
చెందుతున్నారు. విద్యార్థులు భయం,భయంగా బడికి వెళుతున్నారు. అక్టోబర్‌లో కోవిడ్
థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో ముందస్తు చర్యలు
తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Flash...   Samsung Festive Sale: శామ్సంగ్ ఉత్పత్తులపై తిరుగులేని, తిరిగిరాని ఆఫర్లు.. మిస్ అవ్వొద్దు