Google Photos: ఫొటోలను స్టోర్‌ చేస్తే ఇవి తెలుసుకోండి


గూగుల్‌ ఫొటోస్‌.. ఫొటోలు, వీడియోల బ్యాకప్‌ కోసం ఉపయోగిస్తున్న గూగుల్‌
బేస్డ్‌ ఫ్రీ యాప్‌. చాలామంది ఇందులో ఫొటోలు, వీడియోలను భద్రంగా ఉన్నాయనుకుంటారు.
ఆటోమేటిక్‌గా ఫొటోలు అందులోకి వెళ్తున్నాయని భావిస్తుంటారు. కానీ, గూగుల్‌
ఫొటోస్‌కూ ఓ పరిమితి అంటూ ఉంటుంది. అది దాటినా.. లేదంటే ఫుల్‌ మొమరీతో ఎక్కువ కాలం
నడిపించినా.. ఆ మొత్తం ఫొటోలు, వీడియోలు ఎగిరిపోతాయని మీకు తెలుసా?. కాబట్టి,
గూగుల్‌ ఫొటోస్‌కు సంబంధించి ఈ విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడండి. 

 గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ కోసం ప్రతీ గూగుల్‌ అకౌంట్‌కు ఉచితంగా కొంత స్పేస్‌
ఇస్తుంది గూగుల్‌. ఇందులో ఎక్స్‌ప్రెస్‌, స్టోరేజ్‌ సేవర్‌, ఒరిజినల్‌ క్వాలిటీ
అనే ఆప్షన్లు ఉంటాయి. ఒకవేళ ఒరిజినల్‌ క్వాలిటీని గనుక క్లిక్‌ చేయకపోతే..
ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీతో సేవ్‌ కావు. అప్పుడు ఫొటోలు తక్కువ సైజులో
సేవ్‌ అయ్యి.. ఆ ఫొటోలు, వీడియోలు బ్లర్‌గా గూగుల్‌ ఫొటోల్లో కనిపిస్తుంటాయి.
చాలామంది గూగుల్‌ ఫొటోస్‌లో స్పేస్‌ కోసం తక్కువ క్వాలిటీకే ప్రయారిటీ ఇస్తారు.
కానీ, క్వాలిటీ ఫొటోల్ని దాచుకోవాలనుకుంటే.. ఒరిజినల్‌ క్వాలిటీ ఆప్షన్‌ను
క్లిక్‌ చేయకతప్పదు. 

Storage మించితే.. 

గూగుల్‌ అకౌంట్‌ స్టోరేజ్‌లో గూగుల్‌ డ్రైవ్‌ మాదిరిగానే.. గూగుల్‌ ఫొటోస్‌కి
కూడా 15 జీబీ స్పేస్‌ ఇస్తుంది గూగుల్‌. ఈ పరిమితి దాటిపోతే.. తర్వాతి నుంచి తీసే
ఫొటోలు, వీడియోలు గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌లో ఆటోమేటిక్‌గా సేవ్‌ కావు. అప్పుడు
ఆల్రెడీ సేవ్‌ అయి ఉన్న డాటాపై(ఆల్రెడీ ఉన్న ఫొటోలు, వీడియోపై) ప్రభావం పడే
ఛాన్స్‌ ఉంది. కాబట్టి, గూగుల్‌ వన్‌ సబ్ స్క్రిప్షన్  ద్వారా అదనపు
స్టోరేజ్‌ను గూగుల్‌ ఫొటోస్‌ కోసం కొనుక్కోవచ్చు.

Flash...   WEST GODAVARI PROMOTION SENIORITY LISTS