AP లో కరోనా ఉధృతి మళ్లీ మొదలైందా..? అదే కొంపముంచిందా..?


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలతో వైరస్‌ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ కొనసాగిన సండే లాక్‌డౌన్ కూడా.. ఎత్తేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది.

ఒక్కోరోజు జిల్లాలో 50 లోపు కేసులు నమోదైతే.. మరో రోజు దాదాపు 100 వరకూ కేసులు నమోదవుతున్నాయి. రూరల్, అర్బన్ అని తేడా లేకుండా రోజుకో ప్రాంతంలో రోజుకో మాదిరిగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టెస్టులను పెంచి వైరస్ వాహకులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్‌ పంజా విసురుతోంది. ఇంకా జిల్లాలో 2,778 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఇక్కడ 1800 మంది కరోనాకు బలయ్యారు. జిల్లాలో రోజుకు మూడు వందలకు పైగా కేసులు నమోదవడంతో పాటు.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. తిరుపతి కేంద్రంగా ఎక్కువ నమోదు అవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవడం భయపెడుతోంది. మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు అధికారులు. నెల రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 60 మందికిపైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్రంలో అత్యధిక మరణాలు జిల్లాలోనే నమోదువుతున్నా… అదే స్ధాయిలో తోంబైశాతం మంది రికవరీ అవుతుండటం ఊరటనిస్తోంది. మునుపటిలా బెడ్లకు డిమాండు లేదు.. కొరత కూడా లేదు. అయితే, తాజాగా నమోదవుతున్న కేసులన్నీ.. ఎక్కువగా గ్రామాల్లోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది

Flash...   AP ELECTIONS TO GP: DISRICT WISE PANCHAYATS - RESCHEDULING PHASE -I