– ప్రమోషన్లు, సీపీఎస్ రద్దు
– కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
– ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి హామీ..
ఆగస్టు 6- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు పీఆర్సీ ఈ నెలల్లోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు ఎన్ జీ వో నేతలు వెల్లడించారు. రాష్ర్ట ఎన్ జీ వో సంఘం నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ధనుంజయ్ రెడ్డిని కలిసి మళ్లీ డిమాండ్లు వినిపించారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి , రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు ఆయనను కలిశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ, కొన్ని శాఖల్లోని ప్రమోషన్లు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చించినట్లు తెలిపారు. ఈ వివరాలను ఎన్ జీ వో అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ధనుంజయ్ రెడ్డి హామీలు…
– పీఆర్సీ ఈ నెలలో అమలు చేస్తాం
– సచివాలయ ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చి రెగ్యులర్ చేస్తాం
SOURCE: UDYOGULU.NEWS