పది పాస్ అయితే చాలు.. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

పది పాస్ అయితే చాలు.. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా లక్షల మంది పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మీరు గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం కలిగి ఉండాలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.

పంజాబ్ రాష్ట్రం రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు 10వ తరగతి, ITIలో పొందిన మార్కులు, రిజర్వేషన్ రూల్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక చేయబడతాయి. ఈ ఉద్యోగాల గురించి పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 550

ట్రేడ్‌ల వారీగా ఖాళీలు:

  • ఫిట్టర్: 200
  • వెల్డర్(G&E): 230
  • మెషినిస్ట్: 05
  • పెయింటర్(జి): 20
  • కార్పెంటర్: 05
  • ఎలక్ట్రీషియన్:75
  • AC మరియు రిఫ్రిజిరేటర్ మెకానిక్: 15

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం (10+2 పరీక్ష విధానంలోపు), నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 15 – 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి.

Flash...   నెలకి 71 వేలు జీతం తో ఐఐటీ మద్రాస్ లో ప్రాజెక్టు రిసెర్చ్ సైంటిస్ట్ - I పోస్ట్ లు

దరఖాస్తు రుసుము: అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

ఎంపిక ప్రక్రియ: 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2024

Download Notification pdf