Lifestyle: మొబైల్ వాడకంతో చిన్నారుల మెదడుపై ప్రభావం.. పరిశోధనల్లో సంచలన విషయాలు

Lifestyle: మొబైల్ వాడకంతో చిన్నారుల మెదడుపై ప్రభావం.. పరిశోధనల్లో సంచలన విషయాలు

ప్రస్తుతం smartphone వాడకం అనివార్యంగా మారింది. smartphone లేకుంటే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అయితే ఈ smartphone వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా పిల్లలపై smartphone చాలా ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Mobile phone అతిగా వాడటం వల్ల పిల్లల మెదడు, వినికిడి మరియు మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం పడుతుందని పరిశోధనలో తేలింది. Mobile phone నుండి వెలువడే నీలి కాంతి పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది, వారి ఏకాగ్రతను మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. Mobile phone ఎక్కువగా వాడటం వల్ల పిల్లల వినికిడి శక్తి కూడా తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.

అంతేకాదు Mobile phone నుంచి వచ్చే పెద్ద శబ్దం పిల్లల చెవుల్లోని సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా, వారు వినికిడిలో ఇబ్బంది పడవచ్చు. అలాగే smartphone వినియోగం వల్ల పిల్లల్లో సామాజిక, మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడటానికి తక్కువ ఆసక్తి చూపుతుంది. వారిలో ఒంటరితనం, depression పెరుగుతుంది.

ఐదేళ్లలోపు పిల్లల్లో 99% మంది mobile phones , gadgets లకు బానిసలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ దేశంలోని దాదాపు 66% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఎక్కువ screen సమయం ప్రమాదకరమని తెలియదు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, 65% కుటుంబాలు తమ పిల్లలు అన్నం తినడం TV లో చూపిస్తున్నాయి. 12 నెలల చిన్నారి కూడా రోజుకు 53 నిమిషాలు smartphone లను చూస్తూ గడిపేస్తుంది. మరియు 3 సంవత్సరాల వయస్సులో, screen సమయం గంటన్నరకు పెరుగుతుంది.

Mobile కు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు పడుకునే ముందు phone ఇవ్వకూడదని అంటున్నారు. mobile phones వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. smartphone కు బదులు ఇతర పనులకు అలవాటు పడాలని సూచించారు.

Flash...   Kandipappu: కందిపప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..