AP PRC Shortly: త్వరలో PRC: CM JAGAN

 AP PRC Shortly: త్వరలో పీఆర్సీ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి

  • త్వరలో ఉద్యోగ నాయకులతో సమావేశం
  • జగన్ ను కలిసి వచ్చిన ఎన్ జీ వో నేతల వెల్లడి
  • ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కారానికి హామీ

PRC Shortly: పీఆర్సీ అమలు, కరవు భత్యం చెల్లింపులు, సీపీఎస్ తో సహా
అన్నింటిపై  సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మరోసారి
హామీ ఇచ్చారు. త్వరలోనే ఉద్యోగ  సంఘ నాయకులతో చర్చించి వీటిపై నిర్ణయాలు
తీసుకుని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారని ఎన్ జీ వో సంఘం రాష్ర్ట
అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు తెలిపారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్ జీ వో సంఘం
నాయకులు, రాష్ర్ట కార్యవర్గ నేతలు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై
చర్చించారు. ప్రాధాన్య క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని
చెప్పారన్నారు.  ఆ వివరాలను ఎన్ జీ వో నేతలు వెల్లడించారు. ఆ వివరాలు
ఇలా ఉన్నాయి…

11వ పీఆర్సీని కాలతీతం కాకుండా అమలు చేయాలని కోరాము. 2018 జులై ఒకటి నుంచి
55శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని డిమాండ్ చేశాం. త్వరలో అమలు చేస్తామని
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిచారు.

2018 జులై 1 నుంచి కరవు భత్యం బకాయిలు విడుదల చేయాలని కోరాం.

సి.పి.ఎస్. పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  టక్కర్  ఇచ్చిన
నివేదికపై మంత్రుల బృందం ఏర్పాటు చేశారని, వారి నివేదికపై తక్షణమే నిర్ణయాలు
తీసుకోవాలని విన్నవించాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అడిగాం.
దీనిపైనా ఉద్యోగ నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ
ఇచ్చారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. కరోనా వల్ల ప్రాణాలు
కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక సాయం
అందించాలని కోరాం. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

నాలుగో  తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62
సంవత్సరాలకు  పెంచాలని కోరాం. 

Flash...   ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్2023 : iPhone 14, Redmi 12 ఇంకా చాల డిస్కౌంట్స్..

గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒకే
చోట 9 సంవత్సరాలు పనిచేయ వచ్చనే నిబంధనను పునరిద్దరించాలని కోరాం, గతంలోనే
అంగీకరించారని ఉత్తర్వులు రాలేదని తెలియజేయగా వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు
చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరికి వారు పనిచేసే ప్రాంతాలలో ఇంటి స్థలాలను
మంజూరు చేయాలని కోరాం.

కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజులు స్పెషల్ క్యాజువాల్ లీప్ ను
మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల
ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం తో పాటు కుటుంబంలో అర్హులు.. అయినవారికి
వెంటనే కారుణ్య నియామకాలు  చేపట్టాలని కోరాం. జగన్ సానుకూలంగా
స్పందించారు.

కమర్షియల్ టాక్స్ శాఖలో పనిచేసే అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ /
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్ కు త్వరలో గెజిటెడ్ హోదా ఉత్తర్వులు
ఇస్తామన్నారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావలసిన పెన్షనరీ టెనిఫిట్స్ వెంటనే
చెల్లించాలని ,  ఉద్యోగస్తులు కోరిన వెంటనే జి.పి.ఎఫ్. అడ్వాన్సు,
ఏ.పి.జి.ఎల్.ఐ లోను తదితర బిల్లులను చెల్లించే లా  చర్యలు తీసుకోవాలని
కోరాము. 

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని
విజ్ఞప్తి చేశాం.

1998 డీఎస్సీ వారికి సత్వరమే పోస్టింగులు ఇవ్వాలని కోరాము.

పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు టైం స్కేలు
ఇవ్వాలి. వేతనం రూ.70 వేలకు మించి పెంచాలని కోరాం

ముఖ్యమంత్రిని కలిసిన బృందంలో  ఎన్ జీ వో సంఘం రాష్ట్ర సహా అధ్యక్షులు
సి.హెచ్. పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వి.రమణ, రాష్ట్ర ప్రచార
కార్యదర్శి బి. కృపావరం, కడప జిల్లా అధ్యక్యులు కె.వి. శివారెడ్డి, పశ్చిమ
గోదావరి జిల్లా కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాస్  ఇతర  రాష్ర్ట
కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు.