Online Training for Teachers – ISRO

 టీచర్లకు ఇస్రో. అంతర్జాల శిక్షణ …

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సాంకేతిక
పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు అంతర్జాలంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుందని 
తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఈ నెల 31 నుంచి ఐదు రోజులు నిర్వహించనున్నట్లు
చెప్పారు. 70 శాతం హాజరు నమోదుతో పాటు ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్‌
ద్వారా ధ్రువపత్రం అందిస్తుందన్నారు. ఆసక్తి కల్గిన ఉపాధ్యాయులు ఈ నెల 30లోపు
తమ పేరును 

https:///elearning.iirs.gov.in/edusatregistration/student 

లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. 

ఇస్రో పరిధిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూఫట్‌ ఆఫ్‌ రిమోట్‌
సెన్సింగ్‌(ఐఐఆర్‌ఎస్‌) ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేసిందని
చెప్పారు. ఇస్రో ఈ శిక్షణ 2007 నుంచి ఆన్‌లైన్‌ కోర్సులను 76 సార్లు
నిర్వహించగా దేశ వ్యాప్తంగా 3.05లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారన్నారు.
శిక్షణలో అంతరిక్ష పరిజ్ఞానంతో పాటు వాటి అనువర్తనాల అంశాలపై
తెలియజేస్తారన్నారు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, నీటి భద్రత, ఆహారం,
పర్యావరణం, దూరవిద్య, శీతోష్ణస్థితిపై అధ్యయనం అనే ఉప అంశాలపై పూర్తిస్థాయిలో
అవగాహన కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు

Flash...   Extension of OPS benefits for the technically resigned / voluntary retired employees