LOCK DOWN IN AP: Govt going to implement strict rules to prevent Covid from 05.05.21

 

AP  కరోనా విజృంబిస్తున్న తరుణం లో నిన్న ఒక్కరోజే 24 వేలకి చేరువలో కేసులు  నమోదు అయినందున గవర్నమెంట్ తాజా పరిస్థితి మరియు LOCKDOWN విధించే విషయం పై చర్చిస్తున్నట్లు సమాచారం . 

AP లో కోవిడ్‌–19 నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు ఓపెన్ ఉంటాయని.. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే నడువనున్నాయి. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు ఉండనున్నాయి.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అన్ని షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.  ఆ సమయంలో 144వ సెక్షన్‌ అమలులో ఉండనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేలకుపైగా నమోదవుతున్నాయి.  ఏపీలో తాజాగా 23,920 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,45,022 కేసులు నమోదయ్యాయి.  ఇందులో 9,93,708 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,43,178 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి

Flash...   BLACK FUNGUS : బ్లాక్‌ ఫంగస్‌తో జాగ్రత్త