రెండో డోసు ఆలస్యమైనా కంగారుపడొద్దు.

 
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడం కాస్త ఆలస్యమైతే పనిచేయదన్న కంగారుపడొద్దని, ఆలస్యమైనా రెండో డోసు తీసుకుంటే బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఆలస్యమైనంత మాత్రాన రెండో డోసు వేసుకోవడానికి జంకవద్దని, ఆలస్యమైనా అది పనిచేస్తుందన్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతుండగా, వైద్య నిపుణులు మాత్రం లక్షణాలన్నీ తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ గులేరియా ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వైద్య వసతులపై ఒత్తడి పెరిగింది. ఒకరోగి కోసం ఆసుపత్రిలో చేరితే పది రోజుల వరకు అక్కడే ఉండాలి. కానీ బయట పడకల కోసం నిరీక్షిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది.

Flash...   COVID LEAVE GO MS 45 Dt:05-07-2021.