TS:ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ల స్థానంలోPSHM లు

హెడ్మాస్టర్ల స్థానంలో పీఎస్ హెచ్ఎంలు

సీఎం హామీ మేరకు విద్యాశాఖ ఫైలు .

హైదరాబాద్: TS రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం) పోస్టులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్ పోస్టే లేదు. మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న కొన్ని గ్రామా ల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో లోఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులను ఇచ్చింది. 

ఆ తర్వాత ప్రైమరీ స్కూళ్లకు హెడ్ మాస్టర్ పోస్టులను ఇచ్చింది. లేదు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో హెడ్మాస్టర్లు లేక నిర్వహణ సమస్యగా మారుతోందని, టీచర్లే పాఠాలు చెప్పడంతోపాటు నిర్వహణ పనులు చూడటం ఇబ్బందిగా తయారైందని ఉపాధ్యాయ సంఘాలు CM  KCR ఇటీవల విన్నవించారు. దీంతో ఆయన 10 వేల స్కూళ్లలో హెడ్మాస్టర్ పోస్టులను ఇస్తామని హామీఇచ్చారు. ఆ హామీమే రకు కొత్తగా ఇచ్చే ఆ పోస్టుల కోసం ఆర్థికశాఖకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను పంపింది. ఆ పోస్టులకు పీఎస్ హెచ్ఎంలుగా నామకరణం చేసింది. ఆర్థికశాఖ నుంచి వాటికి అనుమతి లభిం చాక భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని, ఆ తర్వాత పదోన్నతులు చేట్టాలని విద్యాశాఖ భావిస్తోంది.

 ప్రస్తుతం రాష్ట్రంలో 18,217 ప్రాథమిక పాఠశాల అందులో 4,429 పాఠశాలల్లో ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ పోస్టులున్నాయి. కొత్త పోస్టులు వచ్చాక ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అన్న పేరును ఖరారు చేయనుంది

Flash...   KNOW YOUR VOLUNTEER,Grama-Ward Sachivalayam