Facial Attendance: ముఖ ఆధారిత హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయండి.

Facial Attendance విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయండి. -గౌ.AP  CS గారికి APJAC అమరావతి పక్షాన వినతిపత్రం అందజేత.

అమరావతి: ముఖ ఆధారిత హాజరు విధానంతో తమ ఫోన్లలోని వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఉండదని ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వారు లేవనెత్తుతున్న సమస్యలను పరిష్క రించే వరకు బయోమెట్రిక్ విధానాన్నే కొనసాగించాలని గురువారం సీఎస్ జవహర్రెడ్డికి ఆయన విన్నవించారు. ఈమేరకు రాష్ట్ర నాల్గో తరగతి ఉద్యో గుల కేంద్ర సంఘం అధ్యక్షుడు మల్లీశ్వరరావు, మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, కార్మిక అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కిశోర్ కుమార్ లతో కలిసి సచివాలయంలో సీఎస్కు విన తిపత్రం సమర్పించారు.

 ‘ముఖ ఆధారిత హాజరు విధానాన్ని స్వాగతి స్తున్నాం. అయితే ఈ విధానంతో క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లే ఫీల్డ్ స్టాఫ్ ఎక్కడుంటే అక్కడే హాజరు వేసేలా యాప్లో మార్పు చేయాలి. స్మార్ట్ఫోన్లు లేని వారికి ప్రభుత్వమే వాటిని సమకూర్చాలి’ అని వినతిపత్రంలో కోరారు.

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఉద్యోగుల పేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్లో సాంకేతికలోపా లకారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరా వతి డిమాండ్ చేసింది. యాప్ అమలులో ప్రతిబంధకాలు, ప్రయోజ నాలపై ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇం దులో భాగంగా గురువారం సచివాలయం మొదటి బ్లాక్ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డిని జేఏసీ నేతలు కలుసుకుని వినతిపత్రం సమ ర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని గత నెల 27వ తేదీన ప్రభుత్వం జారీచేసిన జీవో 159 అమలు పై ఉద్యో గుల్లో ఉన్న ఆందోళన నెలకొందని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు సీఎస్ దృష్టికి తెచ్చారు. 

Flash...   AP Employees Facial photographic Attendance of 100 % capturing - Instructions issued

ముఖ ఆధారిత హాజరు వల్ల కలిగే ఇబ్బందులు, ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ ఎదుర్కొనే సమస్యలు వివరిస్తూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మెమొరాండం సమర్పించారు. ప్రస్తుత మున్న బయో మెట్రిక్ విధానం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ విధానం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత గోప్యత దెబ్బతినే అవకాశం లేదని ముఖ ఆధారిత హాజరు విధానం మంచి ప్రక్రియే అయినప్పటికీ పర్సనల్ డేటా కు రక్షణ వుండదని ఉద్యో గుల ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది చిరు ఉద్యోగులేనని ప్రధానంగా నాల్గవ తరగతి ఉద్యోగులు, వాచ్మెన్, ఆర్టీసీ, రికార్డ్ అసిస్టెంట్ స్థాయి మెజారిటీ ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు.