AP లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి – పవన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ఏపీ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  1 నుంచి 9 వ తరగతి వరకు స్కూల్స్ కు సెలవలు ప్రకటించింది.  అయితే, పదో తరగతి క్లాసులు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొన్నది.  దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.  పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  

కరోనా ఉదృతి సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందని, లక్షల మంది విద్యార్థులు, కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టుతున్నారని అన్నారు.  టెన్త్ పరీక్షలు రద్దు చేసి పైతరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Flash...   NPCIL Recruitment 2022: 177 Apprentice Posts